: తిరుమల వెంకన్నకు సరికొత్త సమస్య.. రూ. 8 కోట్ల జరిమానా పడుతుందా?


ఆపద మొక్కుల వాడు, అందరి సమస్యలు తీర్చే తిరుమల వెంకన్నకే సరికొత్త సమస్య వచ్చి పడింది. స్వామి వారి హుండీలో ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 నోట్లు ఏకంగా రూ. 4 కోట్ల వరకు వచ్చిపడ్డాయి. గత రెండు నెలల కాలంలోనే ఈ సొమ్ము హుండీలో చేరింది. ఈ పాత నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు ఈ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బునంతా ఏం చేయాలో సూచించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు లేఖలు రాశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి పాత నోట్లను హుండీలో వేశారన్న సంగతిని లేఖలో పేర్కొన్నామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.

రద్దు చేసిన పాత నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేలు లేదా పాత నోట్లకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏడుకొండలవాడికి రూ. 8 కోట్ల ఫైన్ విధిస్తారా? లేక రూ. 4 కోట్ల పాత నోట్లు తీసుకుని, కొత్త నోట్లు ఇస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News