: ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించిన ఘనత మజ్లిస్‌దే.. అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షాత్తు ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించిన ఘనత ఒక్క మజ్లిస్ పార్టీదేనని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో గురువారం జరిగిన ఎంఐఎం 59వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ యావత్ ముస్లింల చూపు దారుస్సలాం రాజకీయాలపైనే ఉందన్నారు. ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పి న్యాయం జరిగే వరకు పోరాడుతున్నట్టు పేర్కొన్నారు. మక్కామసీదు ఘటనలో నిరపరాధులకు న్యాయం చేసి అప్పటి ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించామని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన ఆలేరు ఎన్‌కౌంటర్ బాధ్యులను జైలుకు పంపి తీరుతామని ప్రతినబూనారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో రెడ్డి, రావు, మారాఠా, బహుజనులు, లింగాయత్, యాదవులు తమ వాణి వినిపించారని, ఇప్పుడు గాడిదలు కూడా మాట్లాడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. గాడిదలపై రాజకీయం జరగడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.