: అమెరికా అత్యుత్తమ అధ్యక్షులు వీరే.. జాబితాను విడుదల చేసిన ‘సీ-స్పాన్’


ప్రజల మనిషిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఉత్తమ నాయకత్వ లక్షణాలున్న అమెరికా మాజీ అధ్యక్షుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.  ‘ప్రెసిడెన్షియల్ హిస్టారియన్స్’ పేరుతో ‘సీ-స్పాన్’ సర్వే నిర్వహించిన సీ-స్పాన్ ఉత్తమ అమెరికా అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. ఇందులో లింకన్‌ తొలి స్థానంలో నిలవగా జార్జ్‌ వాషింగ్టన్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్డ్, థియోడోర్‌ రూజ్‌వెల్డ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా 2009లో నిర్వహించిన సర్వేలో 8వ స్థానానికి పరిమితమైన ఐసెన్‌ హోవర్‌ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచారు.

సీ-స్పాన్ ఇప్పటి వరకు 2000, 2009, 2017లో మూడుసార్లు సర్వే నిర్వహించింది. కాగా ఇటీవల మాజీగా మారిన బరాక్ ఒబామాకు ఈ సర్వేలో తొలిసారి 12వ స్థానం దక్కింది. గత సర్వేలో 36వ స్థానంలో నిలిచిన జార్జిబుష్‌ మూడు స్థానాలు ఎగబాకి 33వ స్థానంలో నిలిచారు. మాజీ అధ్యక్షులపై సర్వే నిర్వహించిన సీ-స్పాన్.. నాయకత్వ లక్షణాలు, సంక్షోభ సమయంలో వారు వ్యవహరించిన తీరు, దూరదృష్టి, అందరికీ సమన్యాయం, పాలనలో నైతిక బాధ్యత తదితర పది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించింది.

  • Loading...

More Telugu News