: చిన్నారులతో కబుర్లు చెప్పిన క్రికెటర్ రాహుల్!


భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఈరోజు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్నంత సేపు దివ్యాంగులైన కొందరు చిన్నారులు మైదానంలోని స్టాండ్స్ నుంచి టీమిండియా ఆటగాళ్లను తిలకిస్తూనే ఉన్నారు. ఈ విషయం గమనించిన క్రికెటర్ కేఎల్ రాహుల్, ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం వారి వద్దకు వెళ్లి చిన్నారుల కబుర్లు విని సంతోషించాడు. ఆ చిన్నారులందరూ రాహుల్ తో కలిసి ఫొటోలకు పోజ్ లిచ్చారు. ఈ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. 

  • Loading...

More Telugu News