: పెన్షన్ క్లెయిమ్.. ‘ఆధార్’ సమర్పణకు గడువు పొడిగింపు!


ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు తమ ఆధార్ కార్డు సమర్పించని వారిని దృష్టిలో పెట్టుకుని గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పదవీ విరమణ అనంతరం పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఉద్యోగులు తమ ఆధార్ కార్డు సమర్పిచేందుకు ఈ నెల 31 వరకు గడువు విధిస్తున్నామని పేర్కొంది. కాగా, ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్ వో) అధికారిక వెబ్ సైట్ ను కొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఉద్యోగులు సంబంధింత సమాచారం ద్వారా ఈ సైట్ లోకి లాగిన్ అయి, ఈపీఎఫ్ బ్యాలెన్స్, యూఏఎన్ పాస్ బుక్, యూఏఎన్ కార్డు, కేవైసీ అప్ డేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈపీఎఫ్ వోకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఈ-మెయిల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Loading...

More Telugu News