: రికార్డు స్థాయిలో 4 వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
దేశవ్యాప్తంగా ఏకంగా 4వేల పీజీ మెడికల్ సీట్లకు ఆమోదం తెలుపుతూ వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర సర్కారు శుభవార్తనందించింది. రికార్డు స్థాయిలో 2017-18 విద్యాసంవత్సరంలోనే పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో ఈ పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గత ఏడాది నుంచి వైద్య విద్య కోర్సులకు నీట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాము ఆ పరీక్ష రాయలేమని ప్రాంతీయ భాషల్లో చదువుకునే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యకు దూరమయిపోతామని ఆవేదన చెందారు. కేంద్ర సర్కారు చేసిన ప్రకటన ఎంతో మంది విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది.