: అఖిలేష్ సాక్షిగా కన్నీరు పెట్టిన ఓ అభ్యర్థి!


ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఓ అభ్యర్థి సీఎం అఖిలేష్ సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యాడు. అఖిలేష్ మందలించారనో లేక వ్యక్తిగత సమస్యల వల్లనో ఆ అభ్యర్థి అలా కన్నీరు పెట్టుకోలేదు. అసమ్మతి కారణంగా తాను పరాజయం పాలవుతానేమోననే అనుమానంతో కన్నీరు కార్చేశాడు. దేవరియాలోని బర్హాజ్ నియోజకవర్గం నుంచి పీడీ తివారి అనే అభ్యర్థి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు.

బర్హాజ్ నియోజకవర్గంలో గెలుపు తమదేనని, బీజేపీపై గెలిచి తీరుతామని అఖిలేష్ తన ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, మాట్లాడేందుకు వెళ్లిన తివారీ, కొన్ని నిమిషాల వ్యవధిలోనే కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, అఖిలేష్ సహా తోటి నాయకులకు, సభకు హాజరైన అభిమానులకు ఆయన ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. పార్టీలో కొందరు తివారిపట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్నారని, అందుకే, ఆయన కన్నీరు పెట్టుకున్నాడని సదరు అభ్యర్థి మద్దతుదారులు చెప్పారు. 

  • Loading...

More Telugu News