: ఆసుపత్రిలోని పసికందును రూ.35 వేలకు అమ్మేసిన వైద్యుడు


రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో దారుణం చోటు చేసుకుంది. అక్క‌డి ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఓ మ‌హిళ నాలుగో సంతానంగా ఓ ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే, ఆ బిడ్డ‌ను డా.శంక‌ర్ 35,000 రూపాయ‌ల‌కి అమ్మేశాడు. మొద‌ట ఆ ప‌సికందు ఐసీయూలో చికిత్స పొందుతుంద‌ని, ఆ తరువాత చ‌నిపోయింద‌ని స‌ద‌రు వైద్యుడు అంద‌రినీ న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. అనుమానం వ‌చ్చిన ఆ శిశువు త‌ల్లిదండ్రులు పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. డా.శంక‌ర్ ఈ పాప‌ను అమ్మేసిన‌ట్లు నిర్ధారించుకున్న పోలీసులు అత‌డితో పాటు శిశువుని కొనుగోలు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News