: ఆ వార్తలన్నీ ట్రాష్.. జస్ట్ రూమర్లే!: నమ్రత
సినీనటుడు మహేశ్ బాబు భార్య, ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన నమ్రత ప్రస్తుతం వెండితెరకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమాయే ఆమె చివరి చిత్రం. అయితే, కొన్ని రోజులుగా ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో తెరకెక్కనున్న ఓ సినిమాలో ఆమె కనిపిస్తారని సినీ అభిమానులు అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ విషయంపై నమ్రత పూర్తి స్పష్టతనిచ్చింది. ఆ వార్తలన్నీ ట్రాష్ అని, అన్నీ రూమర్లేనని చెప్పేసింది. తాను ఇప్పుడు బిజీగానే ఉంటున్నానని తన భర్త మహేశ్ బాబు డేట్స్, ఎండార్స్ మెంట్స్ చూడటంతో పాటు తన పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సి ఉందని చెప్పింది. ఇక తనకు సమయం ఎక్కడ దొరుకుతుందని పేర్కొంది.