: ఆత్మాహుతి దాడి చేస్తే, అమితానంద స్వర్గసుఖం: చేతులెత్తేసిన అబూ బకర్ చెబుతున్నదిదే!


ఐఎస్ఐఎస్ సామ్రాజ్యానికి తాను రారాజునని ప్రకటించుకుని, రెండేళ్ల పాటు సిరియా, ఇరాక్ లలో మారణ హోమం సృష్టించి, చివరికి ఓటమిని అంగీకరించిన అబూ బకర్ అల్ బగ్దాదీ, చివరిగా తన సైన్యానికి ఇచ్చిన సందేశంలో వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ పోరాటంలో ఓడిపోయామని చెబుతూనే, మిగిలిన వారు ఆత్మాహుతి దాడులు చేస్తూ మరణిస్తే, వారికి అమితమైన ఆనందాన్నిచ్చే స్వర్గసుఖాలు లభిస్తాయని, వారికోసం అందమైన అమ్మాయిలు సిద్ధంగా ఉంటారని చెబుతున్న వీడియోను ఇరాకీ టీవీ చానళ్లు 'అల్ సుమారియా', 'అల్ అరేబియా'లు వెల్లడించాయి. ఆయన తన 'వీడ్కోలు ప్రసంగం'ను ఇచ్చారని, ఈ వీడియో కాపీలను ఐఎస్ఐఎస్ మత బోధకులు, పెద్దలకు మంగళవారం నాడు పంచారని పేర్కొన్నాయి.

కాగా, ఇరాక్ భద్రతా దళాలు మోసుల్ లోని చివరి ఐఎస్ఐఎస్ స్థావరాన్ని చుట్టు ముట్టి, ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నాయి. ఇక మోసుల్ లోనే బాగ్దాదీ ఉన్నాడా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. ఇరాక్ లోని చాలా మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పొరుగున ఉన్న సిరియాకు పారిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News