: ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్న హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు


గత ఏడాది భారత జవాన్ల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని హతమైన విషయం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆ ఉగ్ర‌వాద సంస్థ కార్య‌కలాపాలు మాత్రం జ‌రుగుతూనే ఉన్నాయి. ఆ సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాదులు భార‌త్‌లో విధ్వంసం సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. క‌శ్మీర్‌లో పలు చోట్ల ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్న ఆ సంస్థ‌కు చెందిన ఓ ఉగ్ర‌వాదిని భార‌త భద్ర‌త బ‌ల‌గాలు ఈ రోజు ఉద‌యం ప‌ట్టుకున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న జమ్మూ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ), కాశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్‌ఆర్), సీఆర్‌పీఎఫ్ టీమ్‌లు అక్కడికి చేరుకుని బిలాల్ అహ్మద్ అనే మిలిటెంట్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత‌ అధికారులు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News