: ఆస్కార్ లో ‘ఉత్తమ చిత్రం’ తప్పుడు ప్రకటనకు కారణమైన ఇద్దరు ఉద్యోగులపై వేటు


లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మూడు రోజుల క్రితం 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించే క్ర‌మంలో మొద‌ట‌ ‘లా లా ల్యాండ్’ పేరుని ప్ర‌క‌టించి అనంత‌రం ఉత్త‌మ చిత్రం మూన్‌లైట్ అని నిర్వాహకులు త‌ప్పుదిద్దుకున్న విష‌యం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్సవం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇటువంటి ఘ‌ట‌నే చోటుచేసుకోలేదు. ప్ర‌పంచ దేశాల ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా చూసే ఆ కార్య‌క్ర‌మం వేదిక‌పై జ‌రిగిన హై డ్రామా ప‌ట్ల నిర్వా‌హకులు సీరియ‌స్ అయ్యారు. అందుకు కార‌ణ‌మైన ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అకౌంటెంట్లుగా ప‌నిచేస్తోన్న బ్రియాన్ క‌ల్లిన‌న్‌, మార్తా రుయిజ్‌ల‌ను అకాడ‌మీ ఉద్యోగాల నుంచి తొలిగించిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News