: అమరావతిలో మరో చారిత్రక ఘట్టం.. ఏపీ నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఈ రోజు ఉద‌యం 11.25 నిమిషాల‌కు రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు, ఏపీ మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలతో పాటు రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన ప‌లువురు రైతులు హాజ‌ర‌య్యారు. వ‌చ్చేనెల 6 నుంచి అమ‌రావ‌తిలో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. కొత్త అసెంబ్లీలో ఇప్ప‌టికే సిబ్బంది విధులు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ లోని అసెంబ్లీ కంటే ఎంతో భిన్నంగా ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. భవనం లోపలికి ప్రవేశించిన మంత్రులు, ఎమ్మెల్యేలు భవనాన్ని పరిశీలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News