: నేను మరణించాక నా ఆస్తులు ఎలా పంచాలంటే..!: ట్విట్టర్లో అమితాబ్ వీలునామా


ఏడు పదులు దాటిన వయసులోనూ ఉత్సాహంగా, కుర్రకారుతో పోటీపడి సినీ ప్రియులను అలరిస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తన స్వదస్తూరితో, తన మరణానంతరం ఆస్తుల పంపకం వివరాలు రాసిన ప్లకార్డును అమితాబ్ ప్రదర్శించారు. "నేను మరణిస్తే, నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే" అని ఆ ప్లకార్డులో ప్రకటించారు.

  • Loading...

More Telugu News