: హైదరాబాద్ పాతబస్తీలో ఉన్మాది దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియరాలిపై ప్రేమికుడు కత్తితో దాడిచేశాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపురాకు చెందిన అయేషా, అంజాద్‌లు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామంటూ అంజాద్ ప్రియురాలిని అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అంజాద్ యువతిపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపైనా దాడికి దిగాడు. తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.