: నెల్లూరులో రూ.70 లక్షల విలువైన పాతనోట్లు స్వాధీనం


పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న పాత నోట్లను  మార్చుకునేందుకు ప్రభుత్వం 50 రోజుల సమయం ఇచ్చింది. అయితే ఇప్పటికీ కొందరు వాటిని బ్యాంకుల్లో మార్చుకోకుండా తమవద్దే అట్టే పెట్టుకున్నారు. పాత నోట్లు కలిగి ఉండడం నేరం కావడంతో అధికారులు అటువంటి వారిపై దాడిచేసి నోట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని సరస్వతి నగర్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.70 లక్షల విలువైన పాతనోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News