: నా సంగతేంటి? ఏమైనా ఆలోచిస్తున్నారా?: జైలుకొచ్చిన మంత్రులకు క్లాస్ పీకిన శశికళ


తనను కలిసేందుకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన ముగ్గురు మంత్రులకు ‘చిన్నమ్మ’ శశికళ తలంటారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎవరికి వారే బిజీగా ఉంటూ తన గురించి కొంచెం కూడా ఆలోచించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్జన కేసులో అప్పీలుకు వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ పదవిపై ఎన్నికల సంఘం పంపిన నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు వహించారంటూ మండిపడ్డారు.

అధికారంలో ఉన్నామన్న మాటే తప్ప తనను గట్టెక్కించే విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదా? అంటూ ప్రశ్నించడంతో  ఏం చెప్పాలో తెలియక మంత్రులు సెంగొట్టయ్యన్, కామరాజ్, దిండుగల్ శ్రీనివాసన్ నీళ్లు నమిలారు. కాగా జైలులో శశికళను సాధారణ ఖైదీలానే పరిగణిస్తున్నామని, ప్రత్యేకంగా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీఐజీ రాజవేలాయుధం పేర్కొన్నారు. శశికళకు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వార్తలు వస్తుండడంతో దానిపై వివరణ ఇవ్వాలంటూ చెన్నైకి చెందిన న్యాయవాది ఒకరు సమాచార హక్కు చట్టం కింద కోరగా డీఐజీ పై విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News