: జగన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ధూళిపాళ్ల నరేంద్ర
జగన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా నందిగామ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో అక్కడి వైద్యులను అడ్డుకోవడం, కలెక్టర్ తో వాగ్వాదానికి దిగడం, ఆయన్ని జైలుకు పంపుతానని జగన్ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మాట్లాడుతూ, అధికారం దక్కలేదనే అక్కసుతో ఉన్న జగన్, ప్రజలపై విషం కక్కుతున్నారని, పాముకు పాలు పోస్తే ఏం జరుగుతుందో.. జగన్ కు ఓట్లు వేసినా అదే జరుగుతుందని అన్నారు.