: శవ రాజకీయాలు చేస్తున్నారు: జగన్ పై బొండా ఉమ ఫైర్
నందిగామ ఆసుపత్రిలో వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతే... జగన్ శవరాజకీయాలు చేశారని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పోలీసులతో జగన్ వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారని అన్నారు. విశాఖ, నందిగామ ఘటనలతో జగన్ మానసిక స్థితి సరిగా లేదనే విషయం అర్థమవుతోందని ఆయన అన్నారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నతాధికారులను దూషిస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.