: విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ కు పోలీసు భద్రత


ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ యుద్ధవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె అయిన గుర్ మెహర్ కౌర్ కు పంజాబ్ ప్రభుత్వం పోలీసు భద్రత కల్పించింది. ఆమెకు భద్రతగా ఇద్దరు మహిళా పోలీసులను నియమించింది. ఏబీవీపీ నాయకులపై ఆరోపణలు చేసినందుకు.... తనను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులకు గుర్ మెహర్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. మరో వైపు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏబీవీపీని విమర్శిస్తూ ఆమె తరచుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపులు వచ్చాయి.

  • Loading...

More Telugu News