: 2012 ఉత్తమ చలన చిత్రాలకు నంది అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడు నాని, నటి సమంత
2012 సంవత్సరానికి గానూ నంది అవార్డులు అందుకోనున్న ఉత్తమ చిత్రాల పేర్లను కమిటీ చైర్ పర్శన్ జయసుధ ఈ రోజు విజయవాడలో ప్రకటించారు. 2012 ఉత్తమ చిత్రంగా ఈగ, రెండో ఉత్తమ చిత్రంగా మిణుగురులు, మూడో ఉత్తమ చిత్రంగా మిథునం సినిమాలకు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడిగా నాని (ఎటో వెళ్లిపోయింది మనసు), ఉత్తమ నటిగా సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు), ఉత్తమ విలన్‌గా సుదీప్(ఈగ) నిలిచారు. బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరాం ( ఎటోవెళ్లిపోయింది మనసు చిత్రంలోని 'కోటికోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు' పాటకు), మోస్ట్ పాప్యులర్ చిత్రంగా 'జులాయి', బెస్ట్ ఎంటర్టైన్ మెంట్ చిత్రంగా 'ఇష్క్' నిలిచాయి.