: డొనాల్డ్ ట్రంప్ నకిలీ వీడియో... అయినా ఇంటర్నెట్ లో హల్ చల్
ముస్లింలపై మండిపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారు పరమ పవిత్రంగా భావించే మక్కాలోని కాబా గురించి మాట్లాడుతున్నట్లు ఉన్న ఓ ఫేక్ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సౌదీ అరేబియా దేశంలోని మక్కా నగరంలో ఉన్న పవిత్రమైన కాబాలో నెలకొన్న హజ్ యాత్రికుల రద్దీని ఓ ఫొటోలో చూస్తూ అందులో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మొదట అందరూ ఆ వీడియో ఒరిజినలేనని భావించారు. అయితే, తాజాగా ఆ వీడియో నకిలీదని తేలింది. అయినప్పటికీ ఆ వీడియోను నెటిజన్లు తెగచూస్తేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న కేపిటల్ హిల్ జనం రద్దీ ఫొటోను మార్పింగ్ చేసి ఆ స్థానంలో మక్కాలోని కాబా ఫోటో పెట్టారు. నకిలీ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారని అరబ్ న్యూస్ ఛానెల్ పేర్కొంది.