: మన జవాన్లను పాకిస్థాన్ కాకపోతే మరెవరు చంపినట్లు?: తన ట్వీటుపై యోగేశ్వర్ దత్ వివరణ
'మా నాన్న ను పాకిస్థాన్ చంపలేదు... యుద్ధం చంపింది' అంటూ వీరజవాను కూతురు గుర్ మెహర్ కౌర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, దానిపట్ల ఒలింపియన్ యోగేశ్వర్ దత్ నిన్న మండిపడుతూ ఆమెకు కౌంటర్ ఇస్తూ 'యూదులను హిట్లర్ చంపలేదు... గ్యాస్ చంపింది'.. 'ప్రజలను లాడెన్ చంపలేదు... బాంబులు చంపాయి'.. 'కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ చంపలేదు... బుల్లెట్లు చంపాయి' అన్నట్లు పలు ఫొటోలను పోస్టు చేశాడు.
అయితే, ఆయన చేసిన పోస్టులపై ఈ రోజు వివరణ ఇచ్చుకున్నాడు. మెహర్ కౌర్ ఒక అమరవీరుడి కుమార్తె అని, తాను ఆమెకు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నాడు. కేవలం ఆమె అభిప్రాయాలతో విభేదించానని. భారత జవాన్లను పాకిస్థాన్ కాకపోతే ఎవరు చంపినట్లు? అని ఆయన ప్రశ్నించారు. మనం పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్నాం.. అవునా కాదా..? అని యోగేశ్వర్ నిలదీశారు.