: జగన్ పై మరోసారి మండిపడ్డ దేవినేని ఉమ
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నందిగామ ఆసుపత్రిలో జగన్ ఓ రౌడీలా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అధికారులను ఉద్దేశిస్తూ జగన్ ఇష్టానుసారం మాట్లాడారని... ఆయన ప్రవర్తన సిగ్గుపడేలా ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారులకు జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా డిమాండ్ చేశారు.
మరోవైపు, జిల్లా కలెక్టర్ బాబుపై జగన్ దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నామని కృష్ణా జిల్లా అధికారుల సంఘం ప్రకటించింది. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం కూడా ఆక్షేపించింది. పోలీసులంతా అవినీతిపరులే అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదని కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది.