: 10 లక్షల మందిని పంపించేస్తా: ట్రంప్ తాజా వ్యాఖ్యలతో గుబులు!


అమెరికాలోని పది లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే తన ముందున్న మొదటి కర్తవ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న వారిని పంపించి వేయడం ద్వారా ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లకు ఇప్పిస్తానని, దాంతో నిరుద్యోగ సమస్య అన్న మాట వినపడకుండా పోతుందని ఆయన అన్నారు. గత పాలకుల ఇమిగ్రేషన్ విధానం అత్యంత లోపభూయిష్టమని, అందువల్లే కొత్త పాలసీని తీసుకువస్తున్నామని స్పష్టం చేసిన ఆయన, అత్యున్నత నైపుణ్యతతో ఉండి, నిబంధనలన్నీ పాటించే కొద్దిమందికి మాత్రమే వీసాలను మంజూరు చేస్తామని, అడ్డగోలుగా అమెరికాకు వచ్చి పాతుకుపోయే వారిని అడ్డుకుంటామని తెలిపారు.

ఉగ్రవాదాన్ని అణచడమే తన లక్ష్యమని తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను రాయితీలు ఇవ్వనున్నామని, పౌరులందరికీ ఉపయోగపడేలా కొత్త ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. అమెరికా ఉత్పత్తులనే ప్రజలు కొనాలని, అమెరికన్లకే ఉద్యోగాలు రావాలన్నది తన కోరికని వెల్లడించారు. యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లిన వారిలో గుబులు పుట్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News