: పాదయాత్రకు సిద్ధమవుతున్న బాలయ్య.. ఏప్రిల్‌లో మొదలు!
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం పట్టణానికి తాగునీరు అందించే పథకాన్ని సత్వరం పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కోసమే ఈ యాత్ర నిర్వహించనున్నట్టు సమాచారం. బాలయ్య ఏప్రిల్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే గొల్లపల్లి రిజర్వాయర్‌కు పెనుగొండ నుంచి కృష్ణా జలాలు అందుతున్నట్టు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇప్పుడు గొల్లపల్లి నుంచి హిందూపురానికి కృష్ణా జలాలు అందించే పథకం చేపట్టనుండడంతో ఎదురయ్యే అవాంతరాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తన పాదయాత్ర ద్వారా బాలకృష్ణ తెలుసుకుంటారని వారు వివరించారు.