: నా వయసెప్పుడూ పదేళ్లు తక్కువే అనుకుంటా..!: యవ్వన రహస్యం చెప్పిన డ్రీమ్‌గాళ్!
బాలీవుడ్ నటి, ఎంపీ, ‘డ్రీమ్‌గాళ్’ హేమమాలిని తన యవ్వన రహస్యాన్ని వెల్లడించారు. తన వయసు కన్నా ఎప్పుడూ ఓ పదేళ్లు తక్కువగానే ఉన్నట్టు భావిస్తానని, తాను యవ్వనంగా కనిపించడం వెనక ఉన్న రహస్యం అదేనని ఆమె వివరించారు. అంతేకాదు, ఇదే విధానాన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. తాము ముసలి వాళ్లమైపోతున్నామని భావించొద్దని, జీవితంలో వృద్ధ్యాప్య దశ తప్పదని అన్నారు. అయితే ఎప్పుడూ యవ్వనంగా ఉన్నట్టే భావించాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో వయసు పైబడిన వాళ్లే ఉన్నారని, యువత ఈ విధానాన్ని మార్చాలని, వారు రాజకీయాల్లోకి రావాలని ‘డ్రీమ్‌గాళ్’ పిలుపునిచ్చారు.