: ఢిల్లీ వర్సిటీ ర్యాలీలో ప్రత్యక్షమై.. అలజడి రేపిన కన్నయ్య!
ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ కనిపించడం అలజడి రేపింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కన్నయ్య పాల్గొన్నాడు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ విద్యార్థులు 'కన్నయ్య గోబ్యాక్' అనే నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు నినాదాల మధ్యే ఏబీవీపీకి వ్యతిరేకంగా వివిధ కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, లెక్చరర్లు ఢిల్లీ వర్సిటీలో నిరసనలు కొనసాగించారు.