: రిలయన్స్ జియో ఆఫర్లపై ఎయిర్‌టెల్ చైర్మన్ ఆగ్రహం


రిలయన్స్ జియో వెల్‌కం ఆఫ‌ర్‌ త‌రువాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ‌ర్ అంటూ మ‌రో మూడు నెల‌లు తమ ఆఫ‌ర్‌ను కొన‌సాగించిన విష‌యం తెలిసిందే. అయితే మార్చి 31కి ఆ ఆఫ‌ర్ కూడా ముగుస్తుండ‌డంతో రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా రూ. 99లతో సభ్యత్వం పొందవ‌చ్చ‌ని, అలాగే ఇప్పుడున్న‌ ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌ని ఇకపై రూ.303 టారిఫ్‌తో రీచార్జ్ తో పొందవ‌చ్చ‌ని కూడా చెప్పారు.

దీనిపై ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌ సునీల్ మిట్టల్ ఈ రోజు స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జియో చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. జియో తీరుతో భారత టెలీకాం పరిశ్రమ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో స్పెక్ట్రం రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆందోళ‌న వ్య‌క‌్తం చేశారు. జియో ప్రైమ్ పేరిట కొత్తగా టారిఫ్ ప్లాన్లు ప్రకటించడం దౌర్జన్యమని, భరించలేని చర్య అని అన్నారు.
 

  • Loading...

More Telugu News