: శ్వేతసౌధంలోని సోఫాపై షూ కూడా తీయకుండా మోకాళ్లపై కూర్చుని.. అమర్యాదకరంగా ప్రవర్తించిన మహిళ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు కెల్యానే కాన్వే అనే మహిళ శ్వేత సౌధంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లు ఎంతో పవిత్రంగా భావించే శ్వేతసౌధంలో డొనాల్డ్ ట్రంప్ వర్గమంతా ఓ ఫొటో దిగుతుండగా కెల్యానే కాన్వే మాత్రం అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఓ వైపు ట్రంప్‌తో పాటు ఆ దేశ అత్యున్నత అధికారులు అక్కడే ఉండగా మరోవైపు శ్వేత సౌధంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుంది ఆమె. అనంతరం ఏదో ఘన కార్యం చేసినట్లు నవ్వుతూ కనిపించారు. ఆమె చేతిలో సెల్ ఫోన్ కూడా ఉంది. ఈ విషయాన్ని అక్కడున్న వారు ఎవ్వరూ గమనించకపోయినా, అక్కడున్న ఓ కెమెరామెన్ మాత్రం ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.
ఇప్పుడది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వైట్ హౌస్‌లో ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీస మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా కూర్చోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలు దేశాల అధికార ట్విట్టర్ ఖాతాల్లో కూడా ఈ ఫొటో దర్శనమిస్తోంది.
#Trump aide #Conway causes social media storm for kneeling on #WhiteHouse sofa https://t.co/MH9R9hSYR6 pic.twitter.com/jCU9fP4xeK
— Al Arabiya English (@AlArabiya_Eng) February 28, 2017