: జగన్ ఉన్న గదిలోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు!
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివాకర్ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు, ఆసుపత్రిలో జగన్ ఉన్న గదిలోకి కూడా చొచ్చుకుపోయేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో, అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది.