: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు!


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు ల‌భించింది. సీఎన్‌బీసీ టీవీ 18 అందించే ‘స్టేట్ ఆఫ్ ద ఇయ‌ర్’ అవార్డు ఏపీ సొంతం అయింది. మార్చి 23న ఈ అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. ఇండియా బిజినెస్ లీడ‌ర్ అవార్డుల్లో భాగంగా ఈ పుర‌స్కారం అంద‌జేస్తారు. ఈ అవార్డుకు ఏపీని బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయ స్థాయి ప్ర‌ముఖుల జ్యూరీ ఎంపిక చేసింది. వారిలో హెచ్‌డీఎఫ్‌సీ సీఎండీ ఆదిత్య పురి, ఎస్‌బీఐ సీఎండీ అరుంధ‌తి భ‌ట్టాచార్య‌, కేకేఆర్ సంస్థ సీఈవో సంజ‌య్ నాయ‌ర్ తో పాటు ప‌లువురు ప్రముఖులు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. రెండున్న‌ర ఏళ్లుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు యంత్రాంగం రాష్ట్రంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఎంతో క‌ష్ట‌ప‌డుతోందని అన్నారు. అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి సాధిస్తోంద‌ని చెప్పారు. విద్యుత్ వినియోగం, స‌ర‌ఫ‌రా, నీటిపారుద‌ల‌, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక వాటిల్లో రాష్ట్రం ముందంజ‌లో ఉంద‌ని చెప్పారు. రాష్ట్రంలో వాడుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానం, ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్లడం వంటి ప‌లు అంశాల‌ను జ్యూరీ స‌భ్యులు పరిశీలించారు. ఏపీ ఈ అంశాల్లో దేశంలోనే మంచిపేరు తెచ్చుకుంటోందని అన్నారు. రాష్ట్రాలు సాధించిన అభివృద్ధితో పాటు జ‌రుగుతున్న ప‌నులను జ్యూరీ స‌భ్యులు ప‌రిశీలించారని అన్నారు.

  • Loading...

More Telugu News