: జియో ప్రైమ్ మెంబర్ షిప్ రేపటి నుంచే ప్రారంభం!


జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను ఆ సంస్థ రేపటి నుంచి ప్రారంభిస్తోంది. జియో వినియోగదారులు రూ. 99 చెల్లించి జియో ప్రైమ్ కు మారవచ్చు. దీంతో, ఏడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు, ఫ్రీ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. 2018 మార్చ్ వరకు జియో ప్రైమ్ యూజర్లకు ఈ ఆఫర్ లభిస్తుంది. దీని కోసం చేయాల్సిందల్లా ఒకటే. దగ్గర్లోని జియో స్టోర్ లో కాని, ఆన్ లైన్ లో కాని ప్రైమ్ మెంబర్ షిప్ ను నమోదు చేసుకోవడమే.

జియో ప్రైమ్ యూజర్లకు మరో రెండు టారిఫ్ ప్లాన్స్ ను కూడా అందుబాటులోకి తెస్తోంది జియో. రూ. 149 నెలవారీ ప్లాన్ తో... ప్రతి రోజూ 2జీబీ 4జీ డేటాను వినియోగదారులకు అందించనుంది. దీంతోపాటు రూ. 499 ప్లాన్ తో నెలకు 60జీబీ డేటాను అందించే యోచనలో జియో ఉంది. జియో ప్రైమ్ ప్రోగ్రాం పేరుతో ఈ నెలవారీ ప్లాన్లను జియో అందించనుంది. 

  • Loading...

More Telugu News