: ఈసీ నోటీసులకు సమాధానం పంపిన అన్నాడీఎంకే... శశికళ నియామకం చెల్లుతుందని 72 పేజీల వివరణ


అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం నిబంధనల మేరకే జరిగిందని ఆ పార్టీ 72 పేజీల సుదీర్ఘ వివరణ పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ కు పంపింది. ఏ నిబంధనల ప్రకారం శశికళ నియామకం జరిగిందని ఈసీ ప్రశ్నించిన నేపథ్యంలో పార్టీ సమాధానం ఇచ్చింది. ఈ వివరణలో పార్టీ జనరల్ కౌన్సిల్ కు ఎవరినైనా తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించే అధికారం ఉందని స్పష్టం చేసింది. అందుకు తమ పార్టీ మాన్యువల్ సహకరిస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఆమెనే కార్యదర్శిగా కొనసాగిస్తామని, ఆమె నియామకం ఏకగ్రీవంగా సాగిందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News