: 8 జీబీ ర్యామ్ తో, ఆండ్రాయిడ్ 7తో 'వన్ ప్లస్ 5' స్మార్ట్ ఫోన్
చైనా కేంద్రంగా పనిచేస్తూ, స్మార్ట్ ఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న వన్ ప్లస్ ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన మరో సంచలన ఫోన్ ను ఆవిష్కరించింది. ఇప్పటికే విజయవంతమైన 'వన్ ప్లస్ 3' మోడల్ తో సత్తా చాటిన సంస్థ చైనీయులు దురదృష్టంగా భావించే '4' వర్షన్ ను విడుదల చేయకుండా '5'ను విడుదల చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో అందుబాటులోకి రానున్న ఫోన్ ధర రూ. 30 వేల వరకూ ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 7.0 (నౌగాట్) ఆపరేటింగ్ సిస్టమ్, 16/8 ఎంపీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ సదుపాయం, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సదుపాయాలుంటాయి. గోల్డ్, వైట్, బ్లాక్, సెరామిక్ రంగుల్లో లభిస్తుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.