: పెనుగంచిప్రోలుకు బయలుదేరిన వైఎస్ జగన్
గత రాత్రి హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు, సహాయ చర్యలను పరిశీలించేందుకు ఆయన హుటాహుటిన పెనుగంచిప్రోలు బయలుదేరారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే. తొలుత బస్సు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లనున్న జగన్, ఆపై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని, అందుబాటులో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వైకాపా వర్గాలు వెల్లడించాయి.