: సెహ్వాగ్ ట్వీట్ నా గుండెను బద్దలు చేసింది: గుర్ మెహర్ కౌర్


టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెలను బద్దలు చేసిందని ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏబీవీపీని ఉద్దేశిస్తూ, "నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు... యుద్ధం చంపింది" అంటూ గుర్ మెహర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. "రెండు ట్రిపుల్ సెంచరీలను నేను చేయలేదు... నా బ్యాట్ చేసింది" అంటూ వీరూ ట్విట్టర్ లో స్పందించాడు.

ఈ నేపథ్యంలో గుర్ మెహర్ మాట్లాడుతూ, సెహ్వాగ్ ట్వీట్ చూడగానే తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పింది. చిన్నప్పటి నుంచి సెహ్వాగ్ ను చూస్తున్నానని... తనను ఉద్దేశిస్తూ ఆయన ఈ విధంగా ట్వీట్ ఎందుకు చేశారో అని వ్యాఖ్యానించింది. గుర్ మెహర్ కౌర్ తండ్రి కెప్టెన్ మణ్ దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. 

  • Loading...

More Telugu News