: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహం
మూడు రోజుల క్రితం అమెరికాలో జాత్యహంకార హత్యకు గురైన తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా నుంచి వచ్చిన కార్గో విమానంలో శ్రీనివాస్ మృతదేహంతో పాటు ఆయన భార్య, సోదరుడు, సోదరుడి భార్య, మరో మిత్రుడు వచ్చారు. రేపు ఉదయం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ తల్లిదండ్రులు హైదరాబాద్ శివారులోని బౌరంపేటలోని ప్రణీత్ బౌంటీలో ఉంటున్నారు. శంషాబాద్ నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని అక్కడికే తరలిస్తున్నారు.