: మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఎల్లుండే సంతకం చేయనున్న డొనాల్డ్ ట్రంప్!
కొన్ని రోజుల క్రితమే ఏడు దేశాల ముస్లిం ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి కలకలం రేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఆయన జారీ చేసిన ఆ ఆదేశాలపై ఫెడరల్ కోర్టు జడ్జీ అడ్డుతగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త వలస విధానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన ఎల్లుండే సంతకం చేయనున్నారని వైట్ హౌస్ తెలిపింది. అంతకు ముందు ఆయన తమ దేశ కాంగ్రెస్‌లోని చట్టప్రతినిధులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహిస్తారని చెప్పింది. గత వారమే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయాలనుకున్న ట్రంప్ అందులో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకునేందుకే ఈ వారానికి వాయిదా వేశారు.