: కొత్త పంచాయితీ.. అమెరికాలో ప్రవేశానికి ల‌భించ‌ని వీసాలు.. ఉత్తర కొరియాతో చ‌ర్చ‌లు ర‌ద్దు


ఉత్త‌ర‌ కొరియా నియంత కిమ్ జాంగ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ఇటీవ‌లే మ‌లేషియాలో హత్యకు గురైన విష‌యం తెలిసిందే. కిమ్‌ జాంగ్‌ నామ్‌పై దాడికి ఉపయోగించిన వీఎక్స్‌ నెర్వ్‌ అనే రసాయనం ప్రజాసమూహాన్ని ధ్వంసం చేయగల అతిపెద్ద వినాశిని అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నేపథ్యంలో, ఉత్తర కొరియా ప్ర‌తినిధుల‌కు వీసాల‌ను ఇవ్వ‌కుండా అమెరికా తీసుకున్న నిర్ణ‌యంతో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు ర‌ద్దు అయ్యాయి. ఇరు దేశాల మ‌ధ్య అన‌ధికార‌ చర్చలు జ‌రిపేందుకు రావాల్సిన ఉత్తర కొరియా బృందం వీసాలకు ఆమోదం తెలిపే ప్రక్రియను అమెరికా అధ్య‌క్షుడి పాల‌క వ‌ర్గం ఉపసంహరించుకున్న‌ట్లు చెప్పింది. ఈ విష‌యాన్ని ఉత్తర కొరియానుంచి అమెరికాకు బయలుదేరనున్న ఆరుగురు అభ్యర్థులకు ఈ మెయిల్‌ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News