: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్


అన్ లిమిటెడ్ కాల్స్‌, డేటా, రోమింగ్ అంటూ ఉచిత మంత్రంతో టెలికాం రంగంలో అడుగుపెట్టి మిగతా కంపెనీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన రిల‌య‌న్స్ జియోకు దీటుగా ముందుకు వెళ్లేందుకు ఎయిర్‌టెల్ పోటా పోటీగా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్ల‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందు ఉంచిన‌ ఎయిర్‌టెల్ ఈ రోజు మ‌రో శుభ‌వార్త చెప్పింది. త‌మ క‌స్ట‌మ‌ర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా కాల్స్, డేటా, మెసేజ్ లపై ఉచితంగా రోమింగ్ అందుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి.  


  • Loading...

More Telugu News