: ఏడు వేల వేతనాన్ని తొమ్మిది వేలు చేద్దామన్న కేసీఆర్‌.. రూ.10 వేలు చేయాల‌న్న అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు.. చివరికి 10,500 చేసిన సీఎం!


తెలంగాణ‌లోని అంగన్‌వాడీ కార్యకర్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జిల్లాకు ఐదుగురు చొప్పున అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో చ‌ర్చించిన కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. అంగన్‌వాడీల అభివృద్ధి, బలోపేతంపై చర్చించారు. ఈ నేప‌థ్యంలో ఏడు వేల రూపాయ‌లుగా ఉన్న‌ వారి వేత‌నాన్ని పెంచుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఏడుని తొమ్మిది చేద్దాం అని కేసీఆర్ అన్నారు. అయితే, క‌ల్పించుకున్న అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు తొమ్మిది కాద‌ని రౌండ్ ఫిగ‌ర్ 10 చేయాల‌ని అడిగారు. దీంతో కేసీఆర్ స్పందిస్తూ ‘తొమ్మిది అంటే ప‌ది అన్నారు.. ఒక్క ప‌నిచేద్దాం... కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన క‌నీస వేత‌న విధానం ప్ర‌కారం ఈసారికి అంగ‌న్ వాడీల వేత‌నాలు రూ.10,500 చేసుకుందాం’ అ‌ని చెప్పారు. దీంతో అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్తలంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది నుంచి ఎవ్వ‌రూ వేత‌నాల‌పై డిమాండ్ చేసే అవ‌స‌రం లేద‌ని, క్ర‌మంగా పెంచుకుంటూ పోతామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News