minister Ganta Srinivasarao: కడప నుంచే వైఎస్సార్ సీపీ పతనం: గంటా


ఆంధ్రప్రదేశ్ లో కడప నుంచే వైఎస్సార్ సీపీ పతనం ప్రారంభమవుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి నామినేషన్ వేశారు. గంటా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభంజనానికి భయపడి వైెఎస్సార్ సీపీ కడపలో తప్ప ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేదని.. కడపలో కూడా టీడీపీయే ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గెలవలేమన్న భయంతో క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని చెప్పారు. తమకు ప్రజా బలం ఉందని పేర్కొన్నారు.

minister Ganta Srinivasarao
Ysrcp
Telugudesam
Mlc elections
  • Loading...

More Telugu News