: యూఎస్ లో మరో ఇండియన్ పై జాతి విద్వేష దాడి!


అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి విద్వేష దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడికి దిగిన గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గోడలపై కోడిగుడ్లు విసిరి, కుక్కల అశుద్ధం పూసి, విద్వేష వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు అంటించారు.

'గోధుమ రంగు చర్మం వాళ్లు, లేదా భారతీయులు ఇక్కడ ఉండొద్దు' అంటూ పోస్టర్లపై రాశారు. ఇక ఈ దాడికి గురైన భారత సంతతి వ్యక్తి, తన పేరును బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. అందరు అమెరికన్లూ ఇలాంటివారు కాదని, తన ఇంటి గోడలను శుభ్రం చేయడానికి చుట్టుపక్కల వాళ్లు సాయపడ్డారని చెప్పాడు. అయితే, మరోసారి దాడి జరగవచ్చని భయపడుతున్నట్టు వెల్లడించాడు. కాగా, ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, ఇది ఒకరిద్దరి పని అయివుండదని, పెద్ద సమూహమే వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News