: శ్రీహరికోట ‘షార్’లో అగ్నిప్రమాదం!


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘షార్’లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి స్క్రాప్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో భవనం తలుపులు, కొంత సామగ్రి కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. వ్యర్థ ఘన ఇంధనం నిల్వచేసే ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఫిబ్రవరి 23, 2004లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ‘షార్’ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News