: అదేం లేదు.. సాంగ్ కోసం హీరో నితిన్ నా కాళ్లు ప‌ట్టుకోలేదు: గుత్తా జ్వాల


అర్జున అవార్డు గ్ర‌హీత, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఈ రోజు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు చెప్పారు. త‌న త‌ల్లి చైనీస్ అని, తండ్రి తెలుగు వ్య‌క్తి అని, వారి నుంచే త‌న‌కు ఈ అందం వ‌చ్చింద‌ని, అది త‌న అదృష్ట‌మ‌ని అన్నారు. ఓ సాంగ్‌లో న‌టించాల‌ని హీరో నితిన్ త‌న కాళ్లు ప‌ట్టుకున్నార‌న్న విషయం వాస్త‌వం కాదని గుత్తా జ్వాల అన్నారు. అటువంటిదేమీ లేదని చెప్పారు.

ఆ సాంగ్‌లో త‌న పేరు ఉంద‌ని, అది ఐటం సాంగ్ కాద‌ని చెప్పారు. స్పెష‌ల్ సాంగ్‌లో అమ్మాయిలా కాకుండా, ఆంటీలా క‌నిపించింద‌ని కొంతమంది అనుకున్నార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెబుతూ, త‌న‌కు ఇప్పుడు 32, 33 ఏళ్ల‌ని, త‌న‌ని ఆంటీ అనుకోవ‌డంలో త‌ప్పేముంద‌ని దీటైన స‌మాధానం ఇచ్చారు. తాను ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటానని, కానీ డ‌ప్పు కొట్టి చెప్పుకోనని గుత్తా జ్వాల తెలిపారు.

  • Loading...

More Telugu News