: 'వేలంటైన్స్‌ డే'కి బోల్డన్ని పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులూ పంపించారు: హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌


శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలో ‘నిత్య’గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. ఇటీవ‌ల జ‌రిగిన వేలంటైన్స్‌ డేకి తాను గులాబీలు అందుకున్నాన‌ని చెప్పింది. అస‌లు ఆ రోజుని ప్రేమికులే జరుపుకోవాల్సిన అవసరం లేదని, అభిమానం ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా చేసుకోవచ్చని పేర్కొంది. ఆ రోజున త‌న ఫ్యాన్స్ త‌న‌కు బోల్డన్ని పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులూ పంపించారని ఆమె సంతోషంగా చెప్పింది.

తన ఫ్యాన్స్‌కి తాను ‘వెల్‌ విషర్స్‌’ అని పేరు పెట్టానని, వారిని ఫ్యాన్స్ అన‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని తెలిపింది. సినిమాల్లో గ్లామరస్‌గా క‌నిపించ‌డం అంటే పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు హాట్‌గా కనిపించడం కాద‌ని, న‌టి చుడీదార్‌ వేసుకున్నా అలా కనిపించడమే గ్లామ‌ర‌స్ అని ఆ అమ్మ‌డు చెప్పింది. ఒకవేళ క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే తాను బురఖా వేసుకుని యాక్ట్‌ చేయడానికి కూడా రెడీ అని చెప్పింది. సినిమాల్లో పాత్ర బాగుంటే గ్లామరస్‌ డ్రెస్సులు వేసుకోవడానికి తాను వెనకాడ‌బోన‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News