: విందుకు హాజరుకానని తెలిపిన ట్రంప్... రాకపోయినా కార్యక్రమం జరుగుతుందన్న వైట్ హౌస్ ప్రతినిధుల అసోసియేషన్‌


ఏప్రిల్ 29న వైట్ హౌస్ ప్రతినిధుల విందు జ‌ర‌గ‌నుంది. స్వతంత్ర వార్తా మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోన్న ఈ విందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విందుపై స్పందిస్తూ... తాను ఆ కార్య‌క్ర‌మానికి హాజరుకానని తేల్చి చెప్పారు. దయచేసి అందరూ బాగుండాలని కోరుకోండని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. చివ‌రికి శుభ సాయంత్రం అని ట్వీట్‌ చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై స్పందించిన వైట్ హౌస్‌ ప్రతినిధుల అసోసియేషన్‌ అధ్యక్షుడు జెఫ్‌ మాసన్‌.. ట్రంప్‌ రాకపోయినా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్వతంత్ర వార్తా మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News