: కనీస వేతనాలను భారీగా పెంచిన కేజ్రీవాల్ ప్రభుత్వం
అసంఘటిత రంగంలో పనిచేస్తూ, నైపుణ్యం పెద్దగా లేని కార్మికులు సహా, రాజధానిలోని అందరు ఉద్యోగుల కనీస వేతనాన్ని భారీగా పెంచుతున్నట్టు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. అన్ స్కిల్డ్, సెమీ, స్కిల్డ్ ఉద్యోగుల కనీస వేతనాన్ని 37 శాతం పెంచుతూ నెలకు కనీసం రూ. 13,350 వేతనాన్ని నిర్ణయించింది. కనీస వేతనాలపై గత సంవత్సరంలో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన 15 మంది సభ్యుల కమిటీ ఇచ్చిన అన్ని సిఫార్సులనూ ఆమోదిస్తున్నట్టు ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సిఫార్సులను ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజాల్ కు పంపుతున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. దీనివల్ల ఢిల్లీలోని కార్మికుల జీవనం మెరుగవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.