: విషాదం.. సినీన‌టి రెజీనాను చూడటానికి షోరూంకి వచ్చి, సజీవ దహనమైన యువకుడు!


సినీన‌టి రెజీనా ప్రారంభించబోతున్న నీరూస్ షోరూం వద్దకు చేరుకున్న ఓ యువ‌కుడు అంతా చూస్తుండగానే సజీవ దహన‌మ‌యిన ఘ‌ట‌న గుంటూరు సిటీలో చోటుచేసుకుంది. ఆ షోరూం వ‌ద్ద‌కు అంద‌రితో పాటే వ‌చ్చిన స‌ద‌రు యువ‌కుడు విజ‌య్‌ ఓ ఫ్లెక్సీని ముట్టుకున్నాడు. అయితే,  షోరూంను ఆనుకుని ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఆ ఫ్లెక్సీని తాకి ఉండ‌డంతో అత‌డికి షాక్ కొట్టింది. దీంతో అక్క‌డే కుప్పకూలిపోయిన విజ‌య్... ట్రాన్స్ ఫార్మర్ కారణంగా ఫ్లెక్సీకి మంటలు వ్యాపించడంతో సజీవ దహనం అయ్యాడు. అతడిని మంటల నుంచి బయటకు లాగేందుకు స్థానికులు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఈ ఘటనలో మరో యువకుడికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News